శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Modified: సోమవారం, 21 జనవరి 2019 (13:44 IST)

ఈ రోజు చంద్రగ్రహణం.. మనకు కనబడకపోయినా ఆ రాశుల వారు...

ఈ రోజు చంద్రగ్రహణం.. భారత కాలమానం ప్రకారం జనవరి 21న ఉదయం 8.06 ప్రారంభమై మధ్యాహ్నం 1.18 వరకూ వుంటుంది. ఇది మన దేశంలో కనబడదు కనుక అంతగా ఆందోళన చెందాల్సింది లేదు కానీ ఈ చంద్రగ్రహణం మనస్సుపై ప్రభావం చూపుతాడని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా సింహ, కర్కాటక రాశి వారు శివాభిషేకాలు చేయించుకోవాలి. 
 
పాటించవలసిన నియమాలు 
గ్రహణ కాలానికి 9 గంటల ముందే భుజించాలనేది నియమం. అలాగే ఆ తర్వాత ఎలాంటి భోజన పదార్థాలను భుజింపరాదు. శుభ ఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనేందుకు సరైన సమయమేమిటో పండితులను అడిగి తెలుసుకోవాలి. మధ్యమ ఫలము ఉన్నవారితోపాటు అధమ ఫలము ఉన్నవారు కూడా వస్త్ర, ధాన్య, శాకాది, దానాలను శక్తికొద్దీ చేసుకోవాల్సి ఉంటుంది.
 
గ్రహణ కాలం వరకూ దేవతామూర్తుల పైన, అలాగే నిల్వ ఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి గ్రహణ అనంతరం తీసి వేయాలని పండితులు చెపుతున్నారు. గ్రహణం ముగిసిన మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతామూర్తులను శుద్ధి పరచుకోవాలని పండితులు వెల్లడిస్తున్నారు. గ్రహణ సమయంలో దేవతా పూజలు అభిషేకాలు చేయరాదు. ఉపదేశిత మంత్రము లేదా ఏదైనా దేవతా నామాన్ని జపిస్తే గణనీయ ఫలము సిద్ధిస్తుందని చెపుతున్నారు.