శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (08:57 IST)

సోమవారం (23-04-18) దినఫలాలు : పనుల్లో ఏకాగ్రత ముఖ్యం...

మేషం : ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన పరిచయాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులక

మేషం : ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన పరిచయాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం : రాజకీయ నాయకుల కార్యక్రమాలు వాయిదా పడతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల్లో వారు మార్పుల కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మిథునం : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురణకు వస్తుంది. ఆస్థికి సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది.
 
కర్కాటకం : మీ పనులు మందకొండిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
సింహం : ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. వస్త్ర, బంగారం వంటి విలువైన వస్తువులను అమర్చుకుంటారు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ ప్రయత్నం నెరవేరగలదు. ప్రయాణాలు అనుకూలం.
 
కన్య : ఫ్యాన్సీ, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలసి రాగలదు. ఉపాధ్యాయులకు సంతృప్తి కానవస్తుంది. రాజకీయ రంగంలోని వారికి విరోధులు చేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. దంపతుల మధ్య అవగాహన కుదరదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
తుల : తలపెట్టిన పనిలో సంతృప్తి, జయం చేకూరగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి మంచికాలం. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. ఏజెంట్లకు మిశ్రమ ఫలితం.
 
వృశ్చికం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసి పోగలవు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. మీ లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
ధనస్సు : ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటు చేకూరుతుంది. ఉద్యోగస్తులు తోటివారి నుంచి మంచి సమాచారం అందుకుంటారు. సోదరులతో అవగాహనాలోపం ఏర్పడుతుంది.
 
మకరం : గణిత, సైన్సు, ఎలక్ట్రానిక్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. నూనె, ఎండుమిర్చి, చింతపండు, వ్యాపారులకు దినదినాభివృద్ధి, ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
కుంభం : గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. చిరు వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. మొండి బాకీలు వసూలు కాగలవు. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
మీనం : రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. సొంతగా వ్యాపారం చేయాలనే పట్టుదల మరింతగా బలపడుతుంది. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతో అవసరం. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి.