మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 13 మే 2019 (10:26 IST)

సోమవారం 13-05-2019 మీ రాశి ఫలితాలు.. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష

మేషం: ఆర్థిక చికాకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. కొంతమంది మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తారు. 
 
వృషభం:  రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ మాట మంచితనమే మీకు శ్రీరామ రక్ష. క్రీడారంగాల పట్ల మక్కువ పెరుగుతుంది. చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీరు స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. 
 
మిథునం: బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పనిచేసే చోట కించెత్తు లోపాన్ని చూపించి ఎదుటి వారు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తికరంగా వుండగలదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం: చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు, ఆటంకాగులు ఎదురవుతాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణల కోసం చేసే యత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి. రావలసిన బకాయిలు కొంత ముందు వెనుకాలైనా అందుటవలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ వుండదు.
 
సింహం: దృఢ సంకల్పం ద్వారా అన్ని కష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల మెళకువ అవసరం, మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. పరిచయాలేర్పడతాయి. 
 
కన్య: రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదుపు సాధ్యం కాదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
తుల: పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
వృశ్చికం: ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. రాజకీయ, రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి లభిస్తుంది. పాత రుణాలు తీర్చడంతో పాటు కొత్త పరికరాలు అమర్చుకుంటారు. 
 
ధనస్సు: గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. లక్ష్య సాధనలో మీ అనుభవం ఉపయోగపడుతుంది. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మకరం: వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. 
 
కుంభం: జీవిత భాగస్వామి సలహాలతో ముందుకు సాగుతారు. విదేశీ యత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుస సహకారం పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన కాలం. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. 
 
మీనం: కీలకమైన వ్యవహారాల్లో జయం, మొండి బాకీలు వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. మీ ప్రియతముల పట్ల ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రికా సంస్థల్లోని వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి.