సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 11 మే 2019 (14:14 IST)

11-05-2019 దినఫలాలు : వెంకటేశ్వరుని ఆరాధించినా సర్వదా శుభం

మేషం : వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, పనియందు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్థించవచ్చు. జాగ్రత్త వహించండి. స్థిరాస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
వృషభం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ వుండదనే చెప్పొచ్చు. పారిశ్రామిక రంగంలోవారికి విద్యుత్ లోపం, కార్మిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సహచరుల సహకారం వల్ల ఉద్యోగస్తులకు శుభం చేకూరుతుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. 
 
మిథునం : ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి చికాకులు తప్పవు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవసేవ పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. భూ వివాదాలు, ఆస్తి, వ్యవహారాలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రుల రాకపోకలతో సందడి నెలకొంటుంది. 
 
కర్కాటకం : ప్రియతముల కోసం ధనం బాగా వెచ్చించవలసి వస్తుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. మీ ఆంతరింగిక సమస్యలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. 
 
సింహం : చేతివృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కన్య : ముఖ్యంగా, ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళకు జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఆశాజనకం. వృత్తి వ్యాపార రంగాల్లో సహచరుల మద్దతు లభిస్తుంది. 
 
తుల : స్త్రీలు గృహోపకరణాలకు విలువైన వస్తువులను కొనుగోలుకే చేయు యత్నాలు వాయిదాపడతాయి. ధనియాలు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలవు. నిరుద్యోగుల యత్నాలు ఫలించకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు తరచూ సభలు సమావేశల్లో పాల్గొంటారు. కుటుంబీకుల మధ్య అవగాహన లోపిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలెదుర్కోవలసి వస్తుంది. లీజు నూతన కాంట్రాక్టులు, వ్యాపారాల విస్తరణకు సంబంధించిన విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. ఆలయాలను సందర్శిస్తారు. 
 
ధనస్సు : ఊహించని ఖర్చులు, దుబారా వ్యయం అధికంగా ఉంటాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రాబడి బాగున్నా ఆర్థికంగా సంతృప్తి అంతంగా ఉండదు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి మీ వ్యవహారాలను చక్కబెట్టుకోవలసి వస్తుంది. 
 
మకరం : ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమహనించండి. మీ సంతానం కోసం ధనం విరిగా వ్యయం చేస్తారు స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. చేతివృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతమాత్రంగానే ఉంటుంది. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్యలు సానుకూలమవుతాయి. 
 
కుంభం : స్త్రీలు తలపెట్టిన పనుల్లో సఫలీకృతులవుతారు. మీ సంతానం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధుమిత్రుల నుంచి అందుకున్న సమాచారం సంతృప్తినిస్తుంది. ఎల్.ఐ.సి పోస్టల్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు చికాకులు అధికమవుతాయి. 
 
మీనం : మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. స్త్రీలకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ నిర్మాణాల్లో వ్యయం మీ అంచనాలను మించుతుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.