శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (08:26 IST)

శనివారం (16-06-18) దినఫలాలు... మిత్రులు, బంధువుల తోడ్పాటుతో...

మేషం: ఉద్యోగస్తుల సమర్ధత, చాకచక్యానికి అధికారుల నుంటి ప్రశంసలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. శారీరక శ్రమ అధికమవుతుంది. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్

మేషం: ఉద్యోగస్తుల సమర్ధత, చాకచక్యానికి అధికారుల నుంటి ప్రశంసలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. శారీరక శ్రమ అధికమవుతుంది. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది.
 
వృషభం: వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాలవారికి ఆశాజనకం. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. పెరుగుతున్న ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్థికస్థితికి అవరోధంగా నిలుస్తాయి. 
 
మిధునం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తికాగలవు. మిత్రులు, బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
కర్కాటకం: వృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ సమస్యల నుండి బయటపడుతారు. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. నూతన పరిశ్రమలు, వ్యాపార విస్తరణలు అనుకూలిస్తాయి.
 
సింహం: ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంతో కొత్త అనుభూతికి లోనవుతారు. వీసా, పాస్‌పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పెద్దలు, పిల్లల ఆరోగ్యంలో స్వల్ప చికాకులుంటాయి.
 
కన్య: అనపసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. కొబ్బరి, పండ్ల, పూల చిరువ్యాపారులకు పురోభివృద్ధి. అనుకున్న కార్యలు మధ్యలో నిలిచిపోవును. చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
తుల: ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి తప్పదు. మిత్రుల తీరు నిరుత్సాహపరుస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. స్త్రీలు వస్త్రములు, ఆభరణముల వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడును. 
 
వృశ్చికం: ఆర్థిక వ్యవహారాల్లలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. మీ కళత్ర మెుండివైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. 
 
ధనస్సు: మార్కెట్ రంగాలవారికి నిరోద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. దైవదర్శనాలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. స్త్రీల ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కుంటారు.
 
మకరం: రాజకీయ రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఎ.సి. కూలర్ మెకానిక్ రంగాలలోవారికి సంతృప్తి కానవస్తుంది. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ సృజనాత్మక శక్తికి, తెలివి తేటలకు గుర్తింపు లభిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
 
కుంభం: కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. బ్యాంకింగ్ రంగాలవారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువుల మద్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది.
 
మీనం: ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. రాజకీయ రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ విషయాలలోను వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.