మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (09:08 IST)

14-06-2018 - గురువారం మీ రాశి ఫలితాలు.. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో?

మేషం: ఆర్థిక విషయాల్లో చురుకుదనం, చేపట్టిన పనుల్లో జయం చేకూరుతుంది. కొంతమంది మీపై అభాండాలు వేసే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. తోటివారి సహకారం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు కళ్ళు, తల,

మేషం: ఆర్థిక విషయాల్లో చురుకుదనం, చేపట్టిన పనుల్లో జయం చేకూరుతుంది. కొంతమంది మీపై అభాండాలు వేసే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. తోటివారి సహకారం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు కళ్ళు, తల, నరాలు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
వృషభం: కొన్ని సందర్భాలలో రిస్క్ తీసుకోవలసిన వచ్చినా చివరికి మంచే జరుగుతుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మిధునం: స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మీకు ఎంతో ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రాత, మౌళిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసి యాజమాన్యం నుండి గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ప్రేమికులు చిక్కుల్లోపడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
 
సింహం: ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. విలువైన పత్రాల విషయంలో మెళకువ వహించండి. ఎ. సి. కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది.
 
కన్య: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల చురుకుగా వ్యవహరిస్తారు. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
తుల: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి.
 
వృశ్చికం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపడతారు. వృత్తి, వ్యాపారులకు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులలో ఏకాగ్రత, పట్టుదల అవసరం. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. ప్రేమికులకు ఎడబాటు, ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు.
 
ధనస్సు: స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
మకరం: ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలలోని వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. ఒక విషయంలో మీ జీవిత భాగస్వామి సలహా పాటించటం వల్ల కలిసిరాగలదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు.
 
కుంభం: కొత్త కొత్త వ్యాపార రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యుల గురించి ధనం వెచ్చిస్తారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభదాయకం. ఉపాధి పథకాల దిశగా నిరుద్యోగుల ఆలోచనలు ఉంటాయి. విదేశీయాన యత్నాలలో ఆటాంకాలు తొలగిపోగలవు.
 
మీనం: పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. వైద్యులకు ఒత్తిడి, ఇంజనీరింగ్‌లకు సంతృప్తి, ప్లీడర్లకు చికాకు తప్పదు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలకు పనివారాలతో ఇబ్బందులు తప్పవు. కంది, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఒక లేఖ మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.