శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (17:34 IST)

29-08-2020 శనివారం దినఫలాలు - నారాయణ స్వామిని ఎర్రని పూలతో పూజిస్తే...(video)

మేషం : వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తాయి. అకాల భోజనం, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి అధికమవుతుంది. పాత బాకీల వసూలులో శ్రమాధిక్య, ప్రయాసలెదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. 
 
వృషభం : బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగులు ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. 
 
మిథునం : చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో శ్రమాధిక్యత, చికాకులు అధికం. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలో పునరాలోచన అవసరం. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. పనులు మొదలెట్టే సమయానికి ఆటంకాలు ఎదురవుతాయి. 
 
కర్కాటకం : మీ శ్రీమతి వైఖరి చికాకు పరుస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం మంచిదని గమనించండి. ట్రాన్స్‌పోర్టు, రవాణా రంగాల వారికి పురోభివృద్ధి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కోర్టు వాయిదాలు నిరుత్సాహరుస్తాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
సింహం : పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి ఉండజాలదు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం. ప్రతిఫలం స్వల్పం. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ విషయాలు ఇతరుల ముందు ఏకరవు పెట్టడం మంచిదికాదు. 
 
కన్య : స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. సంతానం మొండివైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. 
 
తుల : బంధువుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ అనుకూలం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. సహోద్యోగులతో సంప్రదింపులు, వ్యవహారాలలో హడావుడిగా ఉంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. 
 
వృశ్చికం : ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు సంభవిస్తాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, లాభాలు గడిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రస్తు వ్యాపారాలపైనే దృష్టిసారించండి. ఆలయ సందర్శనాలలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
ధనస్సు : దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. కీలక వ్యవహారాల్లో పట్టు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం క్షేమంకాదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆపత్సమంయంలో ఆత్మీయుల తోడ్పాటు సందిస్తారు. 
 
మకరం : ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ఉమ్మడి వెంచర్లు, నూతన పెట్టుబడులకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. ఫ్లీడర్లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలు ఇరకాటానికి గురిచేస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు ఉత్సాహాన్నిస్తుంది. 
 
కుంభం : వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. మీ కృషికి పోత్సాహం లభిస్తుంది. చిట్స్, ఫైనాన్స్, వ్యాపారులకు ఖాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. 
 
మీనం : బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. వస్తుములు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సమస్యలు తలెత్తుతాయి. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి.