శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (05:34 IST)

శుభోదయం... మీ రాశి ఫలితాలు 05-08-2017

మేషం : ఈరోజు విద్యార్థులకు ఏకాగ్రత ముఖ్యం. కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం.

మేషం : ఈరోజు విద్యార్థులకు ఏకాగ్రత ముఖ్యం. కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కార్మికులకు, తాపీ పనివారు సమస్యలను ఎదుర్కొంటారు.
 
వృషభం : సోదరికి బహుమతులు అందజేస్తారు. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. నిరుత్సాహంవీడి ఆత్మవిశ్వాసంతో యత్నాలు సాగించండి. ఏదైనా అమ్మకానికై చేయుయత్నం వాయిదా వేయడం మంచిది. ముఖ్యులతో ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించండి.
 
మిథునం : నిరుద్యోగులకు సదావకాశాలు లభించినప్పటికినీ వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అనుకున్న పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనం సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆత్మీయులకిచ్చిన మాటనిలబెట్టుకుంటారు.
 
కర్కాటకం : ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ధి. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తికానరాగలదు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు.
 
కన్య : వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రేమికులకు ఎడబాటు చికాకులు తప్పవు. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. మధ్యమధ్య ఔషధ సేవ తప్పదు. రావలసిన బకాయిల విషయంలో మెళకువ అవసరం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
తుల : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారికారణంగా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి.
 
ధనస్సు : బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. స్త్రీలకు, టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులకు ఒత్తిడి అధికం. చేపట్టిన పనులు అతికష్టంమ్మీద సమయానికి పూర్తి చేయగలుగుతారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
మకరం : పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయమే అన్ని విధాల శ్రేయస్కరం ధన వ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలలో క్షణం తీరిక ఉండదు.
 
కుంభం : ఉపాధ్యాయలకు ఒత్తిడి, పనిభారం తప్పవు. మనసులగ్నం చేసి పనిపై శ్రద్ధ పెట్టినా ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహంబంధం భవిష్యత్‌లో మీకు మంచి చేస్తుంది.
 
మీనం : అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. దంపతుల మధ్య ఏకీభావం సాధ్యంకాదు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల ధనం అధికంగా వ్యయం చేస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధిపథకాలు దిశగా కొనసాగుతాయి.