సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (05:44 IST)

శుభోదయం : మీ రాశి ఫలితాలు 21-08-17

మేషం : ఈ రోజు పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదుటపడుతుంది. ఏదైనా స

మేషం : ఈ రోజు పత్రిక, ప్రైవేటు, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదుటపడుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడటం మంచిది. స్త్రీలకు పట్టింపులపై ధ్యాస పెరుగుతుంది. 
 
వృషభం : ఈ రోజు దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఉన్నత విద్యల నిమిత్తం చేసే విదేశీయాన యత్నం ఫలిస్తుంది. స్త్రీలకు, చేతి పనులు, సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పడు మెలకువ అవసరం. 
 
మిథునం : ఈ రోజు కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. అనవసర ప్రసంగం వల్ల అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. ఇతరులతో అతిగా మాట్లాడటం వల్ల మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
కర్కాటకం : ఈ రోజు ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో నిలుదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. నిరుద్యోగుల ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. దైవదర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం : ఈ రోజు ఆదాయం పెరిగి సుఖ సంతోషాల వెల్లివిరుస్తాయి. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. పెద్దమొత్తం ధన సహాయం క్షేమంకాదు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. 
 
కన్య : ఈ రోజు స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. 
 
తుల : ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగివస్తుంది. వాహనచోదకులకు దూకుడు తగదు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారమార్గం గోచరిస్తుంది. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. 
 
వృశ్చికం : ఈ రోజు ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : ఈ రోజు వృత్తుల వారు ఆదాయం కంటె వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. 
 
మకరం : ఈ రోజు కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు వేధింపులు అధికమవుతాయి. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు తప్పవు. 
 
కుంభం : ఈ రోజు ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. క్రయ విక్రయాలు సామాన్యం. తాపి, పనివారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించడం అన్ని విధాలా శ్రేయస్కరం. 
 
మీనం : ఈ రోజు ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలగుతారు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా కృషి చేస్తేనే పెండింగ్ పనులు పూర్తికాగలవు.