శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (04:57 IST)

శుభోదయం : మీ రాశి ఫలితాలు 27-08-17

మేషం : ఈ రోజు స్థిరచరాస్తుల క్రయ విక్రయాలలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. ఉద్యోగస్తుల

మేషం : ఈ రోజు స్థిరచరాస్తుల క్రయ విక్రయాలలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లోని వారికి పురోభివృద్ధి.
 
వృషభం : ఈ రోజు ఉపాధ్యాయులకు విద్యార్థులవల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఖర్చులు మీ రాబడికి మించినా ఆర్థిక సంతృప్తి, ప్రయోజనం ఉంటాయి. కాంట్రాక్టర్లు పనివారివల్ల సమస్యలు, ఇబ్బందికి లోనవుతారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.
 
మిథునం : ఈ రోజు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఒకేసారి అనేక పనులు మీద పడటంతో అసహనానికి లోనవుతారు. ప్రైవేటు సంస్థలలో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి.
 
కర్కాటకం : ఈ రోజు విద్యార్థులు ఇతరుల కారణంగా స్థిరబుద్ధిని కోల్పోతారు. కాంట్రాక్టర్లు నూతన టెండర్ల విషయంలో మెలకువ అవసరం. ముఖ్యులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులౌతారు. క్రయ విక్రయాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
సింహం : ఈ రోజు విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మధ్యవర్తిత్వం వహించటంవల్ల మాటపడక తప్పదు. వస్త్ర, ఫ్యాన్సీ, కిరాణా, బంగారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు సదవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం.
 
కన్య : ఈ రోజు నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం అవుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అధికమైన చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు.
 
తుల : ఈ రోజు చిన్నతరహా పరిశ్రమలు, కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారులకు అనుకూలం. సోదరుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవల్సి వస్తుంది. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం లాంటి చికాకులను ఎదుర్కొంటారు. చిన్నతరహా కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. మీరు చేసిన మంచిపనులకు గుర్తింపు లభిస్తుంది.
 
వృశ్చికం : ఈ రోజు ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంక్ వ్యవహారాలలో చికాకులు తప్పవు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కళలు, రాజకీయ, ప్రజా  సంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
ధనస్సు : ఈ రోజు ఆర్థికంగా స్థితి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థలలో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు వాయిదా పడతాయి.
 
మకరం : ఈ రోజు స్త్రీలు రచనా వ్యాసంగాలు, కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు. కాంట్రాక్టర్లు నూతన టెండర్ల విషయంలో మెలకువ అవసరం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ముఖ్యుల నుంచి అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహారాలలో మెలకువ వహించండి.
 
కుంభం : ఈ రోజు ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికం అవుతాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ధ్యాస వహిస్తారు. ఆర్థిక ఇబ్బంది అంటూ లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
 
మీనం : ఈ రోజు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యమైన విషయాలలో అనాలోచితంగా వ్యవహరించటంవల్ల ఇప్పందులు ఎదుర్కోక తప్పదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు వాయిదా పడటం మంచిది. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి.