శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (17:51 IST)

కర్పూరంతో లక్ష్మీదేవి పూజ.. డబ్బే డబ్బు..

Lakshmi Puja
కర్పూరంతో లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారు.. ఎంత కష్టపడినా డబ్బు కోసం ఇబ్బంది పడేవారు.. కర్పూరంతో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో తులతూగడం ఖాయం. 
 
ఆర్థికంగా ఇబ్బంది పడేవారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దాంతో పాటు ఐదు కర్పూరం బిల్లలను తీసుకుని ఒక ఎర్రగుడ్డతో మూటగట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబత్తితో ధూపం వేయాలి. తర్వాత తమ ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఆ తర్వాత కర్పూరాలతో అమ్మవారికి పూజ చేయాలి. 
 
అంతా అయ్యాక లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకుని బీరువాలో.. డబ్బు, బంగారాన్ని దాచుతామో ఆ ప్రదేశంలో వుంచాలి. ఇలా వుంచితే ఆర్థిక ఇబ్బందులే కాదు.. కర్మలన్నీ తొలగిపోయి.. ఐశ్వర్యం చేకూరుతుంది.