శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 8 అక్టోబరు 2022 (22:33 IST)

స్పటిక తాబేలును ఇంట్లో పెట్టుకుంటే...

crystal tortoise
వాస్తులో ఎన్నో రకాలున్నాయి. వీటిలో ఫెంగ్ షుయ్ కూడా ఒకటి. వీటికి సంబంధించిన వాటిని ఇంట్లో సరైన స్థలంలో ఉంచితే ఆర్థిక శ్రేయస్సును తెస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
 
తాబేలు: ఫెంగ్ షుయ్ ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద, శ్రేయస్సుతో పాటు పురోభివృద్ధి కలుగుతుంది.
 
గోల్డెన్ ఫిష్ : సంపద, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి బంగారు చేపలను ఇంటి డ్రాయింగ్ రూంలో ఉంచుతారు.
 
వెదురు: వెదురు ఆనందం, శాంతి, శ్రేయస్సును కలిగిస్తుంది. ఇంట్లో ఒక కుండలో పెట్టుకోవచ్చు.
 
నాణేలు: తలుపు వద్ద ఎరుపు రిబ్బన్‌తో కట్టిన నాణేలను వేలాడదీయడం వల్ల ఇంటికి సంపద, శ్రేయస్సు వస్తుంది.
 
మూడు కాళ్ల కప్ప: మూడుకాళ్ల కప్పతో అదృష్టం వస్తుందని విశ్వాసం. ఈ కప్ప అదృష్టాన్ని మేల్కొల్పుతుంది.
 
విండ్ చైన్ : ఈ విండ్ చైన్ మెయిన్ డోర్‌కి వేలాడదీయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది
 
క్రిస్టల్ ట్రీ: స్ఫటిక చెట్టును ఉంచడం వల్ల ఆనందం, శాంతి, శ్రేయస్సు, గౌరవం లభిస్తాయి.
 
క్రాస్సులా మొక్క: ఈ మొక్కను ఇంటి ఆవరణంలో వుంచడం వల్ల అదృష్టం కలిసివస్తుంది.