శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (23:05 IST)

చిరాకు, ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా? ఈ వాస్తు చిట్కాలను..?

చిరాకు, ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇంట కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముందుగా చిరాకుకు చెక్ పెట్టాలంటే.. ఇంటి నిర్మాణంలో కిటికీలు పెద్దగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలో నుండి గాలి, వెలుతురు ధారాళంగా వస్తే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయని వాస్తు చెప్తోంది. 
 
ఇంట్లోకి సూర్యకాంతి పడడం భౌతిక జీవితానికి శక్తినిచ్చే వనరు మాత్రమే కాకుండా, ఇది ఇంట్లోని వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గాలి, వెలుతురు బాగా వచ్చే ఇంట్లో ఉండే వ్యక్తులు తక్కువగా అనారోగ్యం బారిన పడతారని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పడకగదిలో హాయిగా నిద్రపోవాలంటే.. మంచం నేరుగా మెట్ల క్రింద, బీమ్ లేదా వాష్‌రూమ్ కింద ఉండకూడదు. 
 
ఇక ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా ఇంటి నిండా ఎక్కడపడితే అక్కడ అద్దాలను పెట్టినా అవి ఇంట్లో వ్యక్తులకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. 
 
ఇంట్లో అద్దాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అద్దాలు నెగటివ్ ఎనర్జీకి కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.