బుధవారం, 29 నవంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (18:59 IST)

గ్రహ లక్ష్మి యోగం.. విజయ దశమి తర్వాత ఆ నాలుగు రాశుల వారికి?

Astrology
గ్రహ లక్ష్మి యోగం అంటే శుక్రుడు, అంగారకుడు, బుధుడు ఈ గ్రహాలు ఉచ్ఛస్థితోలో వున్నప్పుడు కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ యోగం కారణంగా ఈ కింది రాశులకు లాభం చేకూరుతుంది. 
 
మేష రాశిలో శుక్రుడి ఉచ్ఛస్థితి కారణంగా గ్రహ లక్ష్మీ యోగం కలుగుతుంది. దీని ఫలితంగా విజయదశమికి తర్వాత అదృష్టం వచ్చి చేరుతుంది.
 
వృషభం: ఈ రాశి వారికి గ్రహ లక్ష్మీ యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యోగంతో గౌరవం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆస్తికి అనుకూలం. శుభవార్తలు వింటారు. ఉద్యోగవకాశాలు పెరుగుతాయి.  
 
సింహం: వ్యాపారంలో పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. అప్పులు తీరిపోతాయి. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఆనందం, ప్రశాంతత ఉంటుంది. శరీర ఆరోగ్యం బాగుంటుంది 
 
కుంభం: ఈ రాశి వారికి ఈ యోగంతో గౌరవం పెరుగుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో విజయం సాధించవచ్చు. కుటుంబంలో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. అప్పులు తొలగిపోతాయి.