శనివారం, 5 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (18:20 IST)

పచ్చ కర్పూరం పూజగదిలో నాలుగేసి వుంచితే?

Pacha karpooram
పచ్చ కర్పూరం వాసన గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. పూజా గదిలో 2 లేదా 4 పచ్చ కర్పూరాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత చోటుచేసుకుంటుంది. పచ్చ కర్పూరం వాసన ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహాన్ని సంపాదించిపెడుతుంది. 
 
కాబట్టి ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పచ్చ కర్పూరం తప్పకుండా ఉండాలి. పచ్చ కర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుంది. పచ్చ కర్పూరాన్ని పసుపు గుడ్డలో కట్టి కుబేరుని మూలలో ఉంచి ధూపం, పూజలు చేస్తే ఇంట్లో ధన ప్రవాహం బాగుంటుందని నమ్మకం. 
 
పచ్చ కర్పూరం వాసన దాని మహిమ ఇంట్లో ఉండే చెడు శక్తిని దూరం చేస్తుంది. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పచ్చ కర్పూరం పెట్టుకోవడం మంచిది. 
 
ఇంట్లో ప్రశాంతత, సుఖం, శ్రేయస్సు, సంతోషం కలగాలంటే పచ్చ కర్పూరాన్ని వాడటం మంచిది. పచ్చ కర్పూరాన్ని ఓ గాజు బౌల్‌లో వుంచి గదుల్లో వుంచితే సర్వం శుభం అవుతుంది.