గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (13:10 IST)

సూర్యోదయం సమయాన ఆదిత్యుడిని ఇలా పూజిస్తే?

ఆదివారం పూట మాంసాహారం తీసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే ఆదివారం సూర్యోదయ సమయంలో పూజ ముగించాలి. మాంసాహారం, మద్యం ముట్టుకోకూడదు. ఆదివారం ఉదయం పూట శుచిగా స్నానమాచరించి.. పసుపు రంగు దుస్తులు ధరించి.. బెల్ల

ఆదివారం పూట మాంసాహారం తీసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే ఆదివారం సూర్యోదయ సమయంలో పూజ ముగించాలి. మాంసాహారం, మద్యం ముట్టుకోకూడదు. ఆదివారం ఉదయం పూట శుచిగా స్నానమాచరించి.. పసుపు రంగు దుస్తులు ధరించి.. బెల్లం, బియ్యంతో సూర్యుడిని పూజించాలి. సూర్యోదయం సమయాన రాగి చెంబుతో పవిత్రమైన నీటిలో కుంకుమను కలిపి సూర్యనమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్రంతో సూర్యుడిని పూజించాలి.
 
సూర్యుడిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంపదలు చేకూరుతాయి. జీవితంలో ఇబ్బందులు ఉండవు. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. గ్రహదోషాలు నివృత్తి అవుతాయి. వ్యాపారాభివృద్ధికి అన్నీ అనుకూలిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆదివారమే కాకుండా ప్రతినిత్యం నిద్రలేవగానే సూర్యభగవానుడిని దర్శించుకుంటే ఆ రోజంతా శుభ ఫలితాలుంటాయి. అలాగే నిద్రలేవగానే స్వర్ణం, తామరపువ్వు, దీపం వెలుగు, అద్దం, సువాసనను వెదజల్లే చందనం, ఆవు-గేదె, వృక్షాలు, కుడిచేయి, మృదంగం, సముద్రం, పంట పొలాలు, గోపురాలను నిద్రలేవగానే వీక్షించేవారికి ఆ రోజంతా శుభప్రదం.