శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 ఏప్రియల్ 2019 (22:55 IST)

దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?

సాధారణంగా మనం ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతుడికి చెప్పుకుని ఆ కష్టాన్ని తొలగించమని వేడుకుంటాము. ఎందుకంటే సర్వము ఆయనకు తెలిసిన సర్వాంతర్యామి గనుక. అయితే భగవంతుడు కలలో కనిపిస్తే అందుకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అసలు భగవంతుడు కలలో కనిపిస్తే దానికి సంబందించిన సంకేతాలు ఏమిటో చూద్దాం.
 
1. దైవం కలలో కనిపిస్తే చాలా శుభకరమైనది అన్న విషయం మనందరికి తెలిసిందే. మరి మనం సమస్యలలో ఉన్నప్పుడు భగవంతుడు కలలో కనిపిస్తే మనం జరగవనుకున్న పనులు జరిగే అవకాశం ఉంటుంది.
 
2. మనం ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు దైవానికి మొక్కులు మొక్కుకుని కష్టం తీరగానే లౌకికి సంబందమైన విషయాలలో పడి అవి మర్చిపోతుంటాము. మీ మొక్కుని గుర్తు చేయడానికి కూడా భగవంతుడు  కలలోకి వచ్చాడని అది ఒక సంకేతంగా తీసుకోవచ్చు.
 
3. మన ఇష్టదైవం కలలో కనిపిస్తే ఆయన ఆశీస్సులు మనకు, మన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని కరుణ బాగా ఉన్నట్లు. ఒక వేళ మనం కష్టలలో గనుక ఉంటే వాటినుండి త్వరలో బయటపడుతామనే సంకేతంగా తీసుకోవచ్చు.
 
4. దేవుడు కలలో కనిపిస్తే మనకు చెప్పకనే చెప్తున్నట్లు ఒక సందేశం వచ్చినట్లు. మనం ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సతమతమవుతున్నట్లయితే మీ అంతరంగాన్ని నమ్మండి అని మనకు ఆయన సందేశం ఇచ్చినట్లు. అంటే మన మనసు మనకు ఎలా చెబితే అలా చేయమని అర్దం.