శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (19:13 IST)

7 సంఖ్య మంచిదా కాదా? (video)

చాలామందికి సంఖ్యల గురించి పట్టింపు, సెంటిమెంట్ వుంటుంది. 3, 6, 7, 8 అంటే చాలామంది ఇష్టపడరు. వీటిలో మరీ ముఖ్యంగా 7 అంటే వామ్మో అనేస్తారు. కానీ 7 అంకెకు ఎంతో ప్రాముఖ్యత వుంది.
 
తిరుమల తిరుపతిలో కొండలు 7. ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7. పాతాళం క్రింద లోకాలు 7. భువర్లోకాలు 7. అలాగే ద్వీపాలు 7. పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7.
 
అగ్ని దేవుని నాలుకలు 7. సప్తస్వరాలు కూడా ఏడే. వారాలు కూడా 7. మరి 7 సంఖ్య మంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి లభిస్తుంది.