శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (08:09 IST)

శనివారం రోజున జయ ఏకాదశి.. పూజ ఇలా చేస్తే సర్వం శుభం

అవును. శనివారం పూట జయ ఏకాదశి రావడం విశేషం అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. జయ ఏకాదశి రోజున పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. జయ ఏకాదశి వ్రతాన్ని ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు. ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరి 12, 2022 శనివారం నాడు ఆచరించబడుతుంది.  
 
సనాతన ధర్మంలో జయ ఏకాదశి చాలా ముఖ్యమైన రోజు. 'జయ ఏకాదశి' మాఘమాసంలోని శుక్ల పక్ష ఏకాదశి. ఈ ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైనది. ఈ రోజు ఉపవాసం చేయడం ద్వారా శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో విముక్తి లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో, జయ ఏకాదశిని 'భూమి ఏకాదశి' మరియు 'భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. 
 
'పద్మ పురాణం', 'భవిష్యోత్తర పురాణం' రెండూ జయ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను పేర్కొన్నాయి. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి జయ ఏకాదశి యొక్క విశిష్టతను వివరించాడు. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల 'బ్రహ్మ హత్య' వంటి పాపాలు తొలగిపోతాయని చెప్పాడు. మాఘ మాసం శివభక్తికి శుభప్రదమైనది, అందుకే జయ ఏకాదశి శివుడు మరియు విష్ణువు ఆరాధకులకు ముఖ్యమైనది.
 
జయ ఏకాదశి పారణ సమయం: 07:01:38 నుండి 09:15 వరకు :13 ఫిబ్రవరి, 2022 అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.  జయ ఏకాదశి రోజున మహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పూజ చేసేటప్పుడు శ్రీకృష్ణుని స్తోత్రాలు మరియు విష్ణు సహస్రనామాన్ని జపించండి. ఈ రోజున 'విష్ణు సహస్రనామం', 'నారాయణ స్తోత్రం' పఠించడం శుభప్రదం. మరుసటి రోజు ద్వాదశి పూజ చేసిన తర్వాతే పారణ చేయాలి.  
 
ఏకాదశి నాడు శ్రీవిష్ణువును ధ్యానిస్తూ ధూపం, దీపం, గంధం, పండ్లు, నువ్వులు, పంచామృతాలతో పూజించడం ఉత్తమం. ఎవరైతే ఈ వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరిస్తారో వారిపై మాతా లక్ష్మి మరియు శ్రీ హరివిష్ణు అనుగ్రహం లభిస్తుంది. 
 
ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు తప్పనిసరిగా హల్దీ లేదా పసుపు, కుంకుమ, అరటిపండును దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.