ఇద్దరు క్రికెటర్లకు డిమోషన్ ఇచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇద్దరు క్రికెటర్లకు షాకిచ్చేలా తెలుస్తుంది. ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడుకు తగ్గించి డిమోషన్ ఇవ్వనుంది. అలాగే ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మది కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మరో ఫాస్ట్ బౌలర్ సిరాజ్‌కు మాత్రం సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు దక్కినుంది. ఏ ప్లస్ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలు ఉన్నారు. ఈ మేరకు కాంట్రాక్ట్ ముసాయిదా బీసీసీఐ సిద్ధం చేసినట్టు సమాచారం.
ఇప్పటికే 2021 అక్టోబరు నుంచి 2022 వరకు ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ముసాయిదాను వరల్డ్ కప్ పూర్తికాగానే బీసీసీఐ సిద్ధం చేసింది. దానిని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ కాంట్రాక్టుల్లో ప్రస్తుతం ఏ గ్రేడ్‌లో ఉన్న పుజారా, రహానేల గ్రేడ్ తగ్గించింది. ఏ నుంచి బికి డిమోషన్ చేసింది.
కాగా, ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్ళకు యేడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.కోటి చొప్పున వార్షిక పారితోషికం అందిస్తారు.