శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 1 జులై 2017 (19:49 IST)

జూలై నెల రాశి ఫలితాలు... అవకాశాలు చేజార్చుకోవద్దు(వీడియో)

మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ఈ మాసం అనుకూలదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ప్రతి వ్

మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం:
ఈ మాసం అనుకూలదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సంతానం చదువులు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అవకాశాలను చేజార్చుకోవద్దు. ఉద్యోగసతులకు కృషి ఫలిస్తుంది. అభినందనలు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు. వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. 
ఈ రాశివారు అమ్మవారిని చామంతి పూలతో పూజించిన సంకల్పసిద్ధ, పురోభివృద్ధి చేకూరుతుంది. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు తప్పకపోవచ్చు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. జూదాలు, పందేల జోలికి పోవద్దు. 
ఈ రాశివారు అమ్మావారిని గులాబి పూలతో పూజించిన కలిసిరాగలదు.
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం ఆశాజనకమే. గృహమార్పు కలిసిరాగలదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ వాక్కు ఫలిస్తుంది. ఆశీస్సులు, ప్రశంసలు అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆందోళన తొలగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. విద్యార్థులకు అత్సుత్సాహం తగదు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
ఈ రాశివారు అమ్మావారిని విరజాజి పూలతో పూజించిన అన్ని విధాల కలిసిరాగలదు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలు అంచనాలను మించుతాయి. అదనపు రాబడి మార్గాలు అన్వేషిస్తారు. ఆత్మీయుల సాయం అందుతుంది. ఒక సమస్య నుంచి బయటపడుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అప్రమత్తంగా మెలగాలి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బంధువులతో పట్టింపులు, విభేదాలు ఎదురవుతాయి. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలనిస్తాయి. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వైద్య, న్యాయవాదవృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. 
ఈ రాశివారు అమ్మావారిని తెల్లకలువ పూలతో పూజించిన శుభదాయకం. 
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం ప్రథమార్థం కొంతవరకు అనుకూలమే. సంబంధాలు, బంధుత్వాలు బలపడతాయి. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. మీపై శకునాల ప్రభావం అధికం. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తంచేయండి. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తి ఉపాధి పథకాలు అంతంతమాత్రంగానే సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. 
ఈ రాశివారు అమ్మవారిని పున్నాగపూలతో పూజించిన మానసిక ప్రశాంతత, పురోభివృద్ధి చేకూరుతుంది. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు పెరిగినా వెసులుబాటు ఉంటుంది. బాకీలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ నొప్పించవద్దు. కార్యసాధనకు కృషి పట్టుదల ప్రధానం. ప్రతిభాపాటవాలు ఆలలస్యంగా వెలుగు చూస్తాయి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పెట్టుబడులు, పొదువు పథకాలకు అనుకూలం. సంతానం చదువులపై దృష్టిసారిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ప్రోత్సాహకరం. 
ఈ రాశివారు అమ్మవారిని మల్లె పూలతో పూజించిన కలిసిరాగలదు. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఈ మాసం అన్ని రంగాల వారికి శుభదాయకమే. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. మీ సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలివ్వొద్దు. బాధ్యతల నుంచి విముక్తి, విశ్రాంతి పొందుతారు. పరిచయంలేని వారితో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం, స్థానచలనం. వ్యాపారాలు, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. 
ఈ రాశివారు అమ్మావారిని ఎర్రమందార పూలతో పూజించిన శుభదాయకం. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఏమంత స్పందన ఉండదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. అనుకోని ఖర్చులు, మనస్థిమితం లేకుండా చేస్తాయి. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కొంటారు. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు పదోన్నతి, కొత్త బాధ్యతల స్వీకరిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. 
ఈ రాశివారు అమ్మావారిని నందివర్ధన పూలతో పూజించిన అనుకున్న పనులు నెరవేరగలవు. 
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతుంటాయి. మీ సమర్థతపై నమ్మకం తగ్గుతుంది. ఆర్థికస్థితి నిరాశాజనకం. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల రాకతో కుదుటపడుతారు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆరోగ్యం, కుటుంబ విషయాల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యాపారాల విస్తరణకు సమయం కాదు. వృత్తి, నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి యత్నించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం. జూదాలు, పందేలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 
ఈ రాశివారు అమ్మవారిని సంపెంగ పూలతో పూజించిన సకల శుభాలు కలుగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పొదుపు మూలకధనం ముందుగానే అందుకుంటారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. మీ శ్రీమతి తీరుకు అనుగుణంగా మెలగండి. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడి అధికం. ప్రయాణంలో విలువైన వస్తువులు జాగ్రత్త. సేవా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  
ఈ రాశివారు అమ్మవారిని పున్నాగ పూలతో పూజించిన మనోవాంఛలు నెరవేరుతాయి. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
గృహంలో సందడి నెలకొంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవివాహితులు శుభవార్త వింటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన వస్తుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ ఔన్నత్యానికి ప్రశంసలు లభిస్తాయి. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదువు చేయాలన్న ఆలోచన ఫలించదు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తుల సమర్థత ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకుంటారు. వస్త్ర, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణంలో ప్రయాసలు తప్పవు. 
ఈ రాశివారు అమ్మవారిని గన్నేరుపుష్పాలతో పూజించిన కలిసిరాగలదు. 
 
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అన్ని రంగాల వారికి అశాజనకమే. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు భారమనిపించవు. విలాస వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఎదుటివారికి మీపై నమ్మకం కలుగుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. సంతానం అత్సుత్సాహాన్ని అదుపు చేయండి. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి.
ఈ రాశివారు అమ్మవారిని కనకాంబరాలతో పూజించిన సంకల్పసిద్ధి, మనోసిద్ధి చేకూరుతుంది.