శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ivr
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (22:02 IST)

నెమలి పింఛాన్ని చూస్తే రాహుగ్రహ దోషాలు పోతాయా?

పడకగదిలో అద్భుతమైన చిత్రాలను ఉంచడం ద్వారా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని వాస్తు నిపుణులు చెప్పే మాట. ముఖ్యంగా.. రకరకాలైన పక్షులు జంటలుగా ఉంటే దృశ్యాలు పడకగదిలో ఉంచితే భార్యభర్తల మధ్య అనురాగం పెం

పడకగదిలో అద్భుతమైన చిత్రాలను ఉంచడం ద్వారా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని వాస్తు నిపుణులు చెప్పే మాట. ముఖ్యంగా.. రకరకాలైన పక్షులు జంటలుగా ఉంటే దృశ్యాలు పడకగదిలో ఉంచితే భార్యభర్తల మధ్య అనురాగం పెంపొందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. 
 
అయితే బెడ్‌రూమ్‌లో నెమలి ఫించాన్ని కంటికి కనిపించేటట్టుగా పెట్టి తెల్లవారు జామున లేవగానే దానిని చూడటం వల్ల రాహుగ్రహ దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభఫలితాలుంటాయని వారు చెబుతున్నారు. 
 
అలాగే.. పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, చిలకకొయ్యలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.