బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Modified: గురువారం, 31 ఆగస్టు 2017 (20:11 IST)

సెప్టెంబరు నెల మీ రాశి ఫలితాలు... 01-09-2017 నుంచి 30-09-2017 వరకు(వీడియో)

కర్కాటకంలో రాహువు, శుక్రులు. సింహంలో రవి, వక్రీ బుధ, కుజ. కన్యలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. 5వ తేదీ బుధునికి వక్రత్యాగం, 12వ తేదీ గురువు తుల ప్రవేశం. 15వ తేదీ శుక్రుడు సింహ ప్రవేశం. 16వ తేదీ రవి కన్య ప్రవేశం. 26వ తేదీ బుధుడు కన్య ప్రవేశ

కర్కాటకంలో రాహువు, శుక్రులు. సింహంలో రవి, వక్రీ బుధ, కుజ. కన్యలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. 5వ తేదీ బుధునికి వక్రత్యాగం, 12వ తేదీ గురువు తుల ప్రవేశం. 15వ తేదీ శుక్రుడు సింహ ప్రవేశం. 16వ తేదీ రవి కన్య ప్రవేశం. 26వ తేదీ బుధుడు కన్య ప్రవేశం. 
 
2వ తేదీ వామనజయంతి, 5వ తేదీ అనంతపద్మనాభ వ్రతము, 8వ తేదీ ఉండ్రాళ్ళతద్దె, 9వ తేదీ సంకటహరచతుర్థి. 21వ తేదీ నుండి శవన్నవరాత్రులు ప్రారంభం. 28వ తేదీ దుర్గాష్టమి, సరస్వతి పూజ, 29వ తేదీన మహర్ణవమి, 30వ తేదీ విజయదశమి. ఈ మాసం అన్ని రాసుల వారికి అమ్మవారి ఆరాధన, ధ్యానం సకల శ్రేయోదాయకం. 
 
మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఆదాయవ్యయాలకు పొంతనవుండదు. దుబారా ఖర్చులు విపరీతం. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. గృహంలో చికాకులు, మనశ్సాంతి లోపిస్తుంది, బాధ్యతగా వ్యవహరించాలి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వస్తువులు, నగదు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. పెద్ద మొత్త సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వైద్య రంగాల వారికి ఆశాజనకం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
అమ్మవారికి గులాబీలు, చామంతులతో అర్చన శుభదాయకం 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. మీ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహమార్పు నిదానం ఫలితాలిస్తుంది. ఒక విషయంలో మీ జోక్యం అనివార్యం. కొత్త సమస్యలెదురయ్యే ఆస్కారం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవివాహితులకు వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు సత్కారాలు అందుకుంటారు. క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమంకాదు. 
కార్యసాధనకు అమ్మవారిని కలువలు, మందారపూలతో పూజించండి. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన వస్తుంది. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. కొంత మొత్తం ధనం అందుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం ధనలాభం. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
చామంతులు తెల్లని పూలతో అమ్మవారి అర్చన కలిసిరాగలదు. 
 
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. అన్నిరంగాల వారికి శుభదాయకమే. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థులు చేరువవుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. గృహనిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. వృత్తుల వారికి సామాన్యం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
మానసిక ప్రశాంతతకు అమ్మవారిని దేవగన్నేరు, జాజిపూలతో పూజించండి. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వాగ్వాదాలు, భేషజాలకు పోవద్దు. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సొంత నిర్ణయాలు తగదు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం, చీటికి మాటికి చికాకులు తలెత్తుతాయి. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఒక సమాచారం. ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు గౌరవ పురస్కారాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం క్షేమం కాదు. 
అమ్మవారికి దేవగన్నేరు, ఎర్ర మందారాలతో అర్చన శుభం. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
గుట్టుగా యత్నాలు సాగించండి. మీపై శకునాల ప్రభావం అధికం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన ధనం అందక ఇబ్బందులెదుర్కొంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లు అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం సంతృప్తికరం. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. వృత్తి ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులు ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. 
అమ్మవారికి పారిజాతం, సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చన శుభం. జయం. 
 
తులారాశి : చిత్ర 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. పదవులు, బాధ్యతల స్వీకరణకు అనుకూలం. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు, ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. 
కార్యసాధనకు అమ్మవారిని కలువలు, చామంతులతో పూజించండి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు చేయూతనిస్తారు. బంధుమిత్రులతో  సత్సంబంధాలు నెలకొంటాయి. వస్త్రప్రాప్తి. వాహనయోగం. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రమేయం అనివార్యం. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తిపరంగా రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ప్రయాణలక్ష్యం నెరవేరుతుంది. 
ఎర్ర మందారాలు, తెల్లని పూలతో అర్చన ఈ రాశివారికి శుభదాయకం. 
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం 
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తిగావు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహం మార్పునకు యత్నాలు సాగిస్తారు. పూర్వ విద్యార్థులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వివాదాలు, పరిష్కార దిశగా సాగుతాయి. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సేవ, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పందాలు, జూదాల జోలికిపోవద్దు. 
దేవగన్నేరు, ఎర్ర గులాబీలతో అమ్మవారికి అర్చన కలిసిరాగలదు. 
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఆర్థిక స్థితి నిరుత్సాహపరుస్తుంది. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక సమాచారం మనస్థిమితం లేకుండా చేస్తుంది. ఆప్తులను కలుసుకుంటారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. సన్నిహితులు సహకరిస్తారు. గృహమార్పు వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దంపతులకు కొత్త ఆలోచలు స్ఫురిస్తాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తంచేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. దైవదర్శనాల్లో ఒకింత అసౌర్యం చెందుతారు. 
అమ్మవారికి కలువలు, గరుడవర్ధని పూలతో అర్చన శుభదాయకం. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. 
యత్నాలు మందకొడిగా సాగుతాయి. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఎవరి సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. సాయం చేయబోయి విమర్శలెదుర్కొంటారు. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ధనంమితంగా వ్యయం చేయండి. ఉపాధ్యాయులకు ఆశాభంగం. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయుల సాయంతో కుదుటపడతారు. వ్యాపారాలు ఏమంత సంతృప్తినీయవు. పెట్టుబడులపై పునరాలోచన అవసరం. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ప్రకటనలను విశ్వసించవద్దు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
అమ్మవారికి చామంతులు, కనకాంబరాలతో అర్చన శుభదాయకం. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం. ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం ప్రథమార్థం ఆశాజనకం. ఆకస్మిక ధనలాభం. వస్త్రప్రాప్తి. వాహన యోగం పొందుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. సమర్థతతో రాణిస్తారు. యత్నాలు ఫలిస్తాయి. ఉన్నత పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. సాధ్యంకాని హామీలివ్వవద్దు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరకు నిల్వలో జాగ్రత్త. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. 
పారిజాతం, కనకాంబరాలతో అమ్మవారి అర్చన కలిసిరాగలదు.