1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (20:36 IST)

ఇంట్లో కామాక్షి దీపం వెలిగిస్తే..?

Kamakshi
Kamakshi
ఇంట్లో కామాక్షి దీపం వెలిగించాలని, కామాక్షి దీపం వెలిగిస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని పూర్వీకులు చెబుతారు. ప్రతి ఇంట్లోని పెద్దలు పవిత్రంగా భావించే కామాక్షి దీపం మంగళవస్తువుల్లో ఒకటి కావడం విశేషం. కామాక్షి దీపం రోజూ వెలిగించి పూజిస్తే ఐశ్వర్యం పెరుగుతుందని, దారిద్ర్యం దరిచేరదని పూర్వీకులు చెప్తుంటారు.
 
కామాక్షి దీపారాధన చేయడం కామాక్షి అమ్మవారిని పూజించడంతో సమానమని, కులదైవమైన కామాక్షి అమ్మన్‌ను కామాక్షి దీపం వెలిగించి పూజించాలని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. సర్వదేవతలకూ శక్తిని ఇచ్చేటువంటి తల్లిగా కామాక్షీ దేవిని పూజిస్తారు.  
 
యజ్ఞ యాగాది కార్యక్రమాలు, ప్రతిష్టలలో, గృహప్రవేశాది కార్యక్రమాలలో ఈ కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం. కామాక్షి దీపాన్ని వెలిగించే వారు కేవలం ఒకే వత్తి వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.