ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (12:47 IST)

ఆ దోషానికి తిరుచ్చెందూర్ వెళ్లాలట...

Lord Muruga
ప్రతి దోషానికి ఓ పరిహార స్థలం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కొన్ని సుప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంటే కొన్ని దోషాలు పూర్తిగా దూరమవుతాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా గురుదోషం ఉన్నవారు తమిళనాడు తిరుచెందూర్ వెళ్లి పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
కుమార స్వామి ఆరు పుణ్యక్షేత్రాల్లో తిరుచ్చెందూరు రెండో ఇల్లు. ఈ పుణ్యక్షేత్రం వద్దనే రాక్షసులను కుమార స్వామి సంహరించాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ స్థలంలో గురువైన దక్షిణామూర్తి కొలువై వుంటాడు.
 
గురు స్థలంగా పేర్కొనబడే ఈ ఆలయాన్ని సందర్శించుకునే వారికి గురుగ్రహ దోషాలతో పాటు సకల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా గురువుగారికి దోష పరిహారాన్ని చేయాల్సిన వారు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించాలని సూచిస్తున్నారు.