మార్గశిర పంచమి.. వారాహి దేవికి పంచముఖం దీపం వెలిగిస్తే?
మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించిన వారు స్వామికి సమర్పించే ప్రతి తులసి ఆకుకి ప్రతి అశ్వమేదయాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేసేవారికి బ్రహ్మ హత్య- ఇతర దోషాలు కూడా తొలగిపోతాయి.
మార్గశిర మాసం అంతా ఉదయం, సాయంత్రం ఇంటి ముంగిట ముందు దీపం వెలిగిస్తే ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మార్గశిర మాసంలో మహావిష్ణువుకు ఆవునేతితో దీపం వెలిగించి.. విష్ణుసహస్ర నామం, భగవద్గీత పారాయణ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
మార్గశిర మాసంలో గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి. మార్గశిర మాసం ఎన్ని పర్వాలకు నెలవుగా పరిగణిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర శుద్ధ ఏకాదశిని "వైకుంఠ ఏకాదశి" అని దీనిని మోక్ష ఏకాదశి అంటారు.
ఈ పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవున్ని దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ ఏకాదశి రోజునే గీతా జయంతి అంటే భగవద్గీతను కృష్ణుడు ప్రబోధించాడని పురాణాలు చెప్తున్నాయి.
అలాగే మార్గశిర పంచమి రోజున వారాహి దేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సుఖశాంతులు వెల్లివిరిస్తాయి. వారాహి దేవికి పంచముఖ దీపాన్ని నేతిలో వెలిగించాలి. పంచమి రోజున సాయంత్రం ఇలా చేస్తే సకలసంపదలు చేకూరుతాయి.