మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (18:42 IST)

తెల్లజిల్లేడు చెట్లున్న చోట పాములు రావట..

తెల్లజిల్లేడు చెట్లున్న చోట, పువ్వులున్న చోట పాములు రావని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. తెల్లజిల్లేడు చెక్కలతో తయారు చేసిన వత్తులతో దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు. సూర్యుని మూలికా చెట్టుగా పరిగణించబడిన తెల్లజిల్లేడు.. సూర్యుని కిరణాల్లోని నీటిని గ్రహించి పెరుగుతుంది. 
 
అలాంటి జిల్లేడు చెట్టు ఇంట్లో వుంటే విఘ్నేశ్వరుడికి అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. తెల్ల జిల్లేడు పువ్వులు, గరిక, షమీ ఆకులను గణనాథునికి సమర్పించడంతో పాటు అత్తరు, జవ్వాదు, పునుగు లాంటి సుగంధ ద్రవ్యాలను విఘ్నేశ్వరునికి పూతలా వేసి.. పూజించిన వారికి మానసిక శాంతి చేకూరుతుంది. ప్రశాంతత చేకూరుతుంది. అలాగే పరమేశ్వరుడికి తెల్లజిల్లేడు పువ్వు ప్రీతికరమని నాయన్మారులు పేర్కొన్నారు.
 
ఇంకా తెల్లజిల్లేడు దేవ మూలికా చెట్టు పరిగణింపబడుతోంది. తెల్లజిల్లేడు చెక్కలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ఇంట పూజ చేస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంట్లోని దుష్టశక్తులు పారిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.