1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (19:05 IST)

బుధవారం గణపతి పూజ.. ఆకుపచ్చని కూరగాయలను..?

గణపతి పూజలో గరిక తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. గరికతో పాటు గన్నేరు పూలతో వినాయక చవితి రోజున వినాయకుడికి పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట. అలాగే దూర్వార పత్రంతో గణేశుడికి పూజ చేస్తే శనిదోషాలు పోతాయట. చాలామంది శని దోషంతో బాధపడుతుంటారు. 
 
ఏ పని చేయాలన్నా అడ్డంకులు వస్తుంటాయి. అటువంటి వారు ఈ దూర్వార పత్రపూజ చేస్తే శని దరిదాపులోకి కూడా రాకుండా పోతుంది. వినాయక చవితి నాడు చాలా మంది 21 రకాల పత్రులతో వినాయకుడికి పూజ చేస్తుంటారు. 
 
వాటిలో అన్నింటి కన్నా ముఖ్యమైంది మాత్రం దూర్వార పత్రమే. దాంతో గణేశ పూజ చేస్తే సకల పాపాలు తొలగి గణపతి అనుగ్రహం కలుగుతుందంటూ పండితులు చెబుతున్నారు.
 
అలాగే చేపట్టే పనులు విజయవంతం కాకపోతే బుధవారం రోజు వినాయకుడికి పూజలు చేయాలి. ఆ రోజు వినాయకుడి ఆలయానికి వెళ్లి ఆయన్ను దర్శించుకోవాలి. అలాగే 11 లేదా 21 దర్భలతో గణేశుడికి పూజ చేయాలి. దీంతో పనిలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి.
 
బుధవారం రోజు వినాయకుడికి ఆలయంలో బెల్లంను నైవేద్యంగా పెట్టాలి. అనంతరం దాన్ని భక్తులకు పంచి పెట్టాలి. ఇలా 7 బుధవారాలు చేయాలి. దీని వల్ల అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇక ఇందుకోసం గణేశుడి రుద్రాక్షను కూడా ధరించవచ్చు.
 
పరీక్షల్లో మెరిట్‌ సాధించాలనుకునే విద్యార్థులు గణేశున్ని పూజిస్తే తప్పక ఫలితం ఉంటుంది. బుధవారం రోజు ఆవులకు గడ్డి తినిపించడం లేదా ఆకుపచ్చని కూరగాయలను తినిపించడం చేయాలి. దీని వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్‌ ఎనర్జీ తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.