శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 4 జులై 2020 (16:59 IST)

05-07-2020 నుంచి 11-07-2020 వరకు మీ వార రాశిఫలాలు

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఆర్థిక లావాదేవీలు ఓ కొలిక్కి వస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు ప్రయోజనకరం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఇతరు విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తిని కలిగిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పత్రాలు, నోటీసులు, అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు ఉన్నాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. టీచర్లకు బదిలీ ఖాయం. అధికారులకు హోదా మార్పు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఈ వారం అనుకూలతలున్నాయి. నిరుత్సాహం వీడి మనోధైర్యంతో వ్యవహరించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదావేసుకుంటారు. పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఫోన్ సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఏ విషయాన్ని తెగేవరకు లాగొద్దు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. అధికారుల తీరును గమనించండి మెలగండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వు 1, 2, 3 పాదాలు. 
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. అనుకూలతలు అంతంత మాత్రమే. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో యాదృచ్ఛికంగా తప్పిదాలు జరిగే ఆస్కారం ఉంది. వాగ్వాదాలకు దిగవద్దు. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహమార్పు అనివార్యం. అధికారులకు హోదా మార్పు స్థానచలనం. ఉపాధ్యాయులకు పనిభారం. విశ్రాంతి లోపం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనం ఇతరులకివ్వొద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. 
పరిస్థితులు అనుకూలిస్తాయి. పొదుపు ధనం అందుతుంది. రుణ విముక్తులై తాకట్టును విడిపించుకుంటారు. ఖర్చులు సంతృప్తికరం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గురు, శుక్రవారాల్లో పనులతో సతమతమవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. సంస్థల స్థాపనలకు యత్నాలు సాగిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
మొండిగా వ్యవహరిస్తారు. మీ వైఖరి కొతంమందికి ఇబ్బంది కలిగిస్తుంది. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. సామరస్యంగా మెలగండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ఖర్చులు విపరీతం. శని, ఆదివారాల్లో ఆకస్మిక ఖర్చులుంటాయి. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడుతారు. అవసరాలు వాయిదాపడతాయి. సంతానంపై చదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హిస్త, చిత్త 1, 2 పాదాలు. 
శ్రమించినా ఫలితం ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సోమ, మంగళవారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అధికారులకు హోదా మార్పు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దూరాన ఉన్న సంతానం క్షేమం తెలుసుకుంటారు. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
మీదైన రంగంలో రంగంలో రాణిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దు. పనులు సానుకూలమవుతాయి. బుధవారం నాడు ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టుగా వదిలేయండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు పదోన్నతి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట. 
ఈ వారం ప్రతికూలతలు అధికం. మీ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ఓర్పుతో వ్యవహరించాలి. ఎవరినీ కించపరచవద్దు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అవసరాలు నెరవేరవు. చెల్లింపులు వాయిదావేసుకుంటారు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ, అధికం. ప్రియతములను కలుసుకుంటారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సన్నిహితుల సలహా పాటించండి. స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. విశ్రాంతి అవసరం. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యాపారాలు సాగక విసుగు చెందుతారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ప్రయాణంలో అవస్థలెదుర్కొంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. పనులు సాగవు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. సరకు నిల్వలో జాగ్రత్త. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభిృద్ధి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలెదురవుతాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
మకరం: ఉత్తారాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. మంగళ, బుధవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు బేరీజువేసుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆపన్నులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గురు, శుక్రవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు వాయిదావేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. గృహం  సందడిగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెళకువ వహించండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. షాపు పనివారలతో జాగ్రత్త. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష మార్గదర్శకమవుతుంది. ప్రశంసలు అందుకుంటారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను మెప్పిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.