బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (19:19 IST)

దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి.. లక్ష్మీపూజ ఎప్పుడు చేయాలి?

diwali
దీపావళి ఐదు రోజుల పండుగ. ధనత్రయోదశితో ప్రారంభమై యమద్వితీయతో పూర్తయ్యే ఈ ఐదు రోజులు దీపావళి పండుగను ఆచరించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది 11 నవంబర్‌ 2023 శనివారం త్రయోదశి చేత ఈరోజు ధనత్రయోదశి పూజను ఆచరించుకోవాలని సూచించారు. అందుచేత రాత్రిపూట వుండే చతుర్దశి శనివారం కావడంతో ఈ రోజున దీపావళి లక్ష్మీపూజను ఆచరించాలి. 
 
కాబట్టి 12వ తారీఖు ఉదయం నరకచతుర్దశికి సంబంధించినటువంటి స్నాన, దాన, తర్పణ, పితృ కర్మలు వంటివి ఆచరించుకొని 12వ తారీఖు రాత్రి అమావాస్య సమయంలో లక్ష్మీదేవిని పూజించుకుని దీపావళి పండుగను జరుపుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
12వ తారీఖు రాత్రి అమావాస్య వ్యాప్తి ఉండటం వలన లక్ష్మీపూజ దీపావళి పూజ, ఆరాధనలు దీపావళి పండుగ వంటివి ఆచరించాలని, 13వ తారీఖు సోమవార వ్రతం, కేదారగౌరీవ్రతం వంటివి ఆచరించుకోవాలని, 14వ తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 14న బలిపాడ్యమి, 15వ తారీఖున యమద్వితీయతో ఈ ఐదు రోజుల దీపావళి పండుగ సంపూర్ణం అవుతుంది.