సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 19 జనవరి 2019 (16:56 IST)

20-01-2019 నుంచి 26-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో బృహస్పతి, శుక్రుడు, ధనస్సులో శని, మకరంలో రవి, కేతువు, బుధులు, మీనంలో కుజుడు, మిధున, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు. 20న బుధుడు మకర ప్రవేశం. ముఖ్యమైన పనులకు విదియ, బుధవారం అనుకూలదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆలోచనులు కార్యరూపం దాల్చుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ఖర్చులు సామాన్యం. రావలసిన ధనం లౌక్యంగా పనులు చేసుకోవాలి. శనివారం నాడు మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి. ఎవరినీ నిందించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడుతాయి. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి మరింత కృషి చేయాలి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం దుబారా ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. కొత్త ఆలోచనులు స్పురిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. శుభవార్త వింటారు. పదవులు స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ధనం డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. వృత్తుల వారికి అనుకూలం.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు ముందుకా సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. గుట్టుగా యత్నాలు సాగించండి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. ఆర్థికలావాదేవీలతో హడావుడిగా ఉంటారు. ఆది, సోమ వారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించండి. అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారాలు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. సాంకేతిక రంగాల వారి ఆదాయం బాగుంటుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. మంగళ, బుధ వారాల్లో వ్యవహారాల్లో ప్రతికూలలెదుర్కుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అనేక పనులతో సతమతమవుతారు. గురు, శుక్ర వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. కుటంబ విషయాలు గోప్యంగా ఉంచండి. ఆదాయం సంతృప్తికరం. రుణ బాధలు తొలుగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం.    
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు అనుకూలం. కొత్త పరిచయాలేర్పడుతాయి. పదపులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. శనివారం నాడు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటారు. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దీర్ఘాకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. యత్నాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు సామాన్యం. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మరమ్మత్తులు, నిర్మాణాలు వేగవంతమవుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆది, సోమ వారాల్లో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. అవివాహితులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాల విస్తరణపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పర్మిట్‌లు, లైసెన్స్‌ల రెన్యువల్‌లో జాప్యం తగదు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గృహమార్పు అనివార్యం. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహనచోదకులకు దూకుడు తగదు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మొహమ్మాటాల, భేషజాలకు పోవద్దు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. రోజువారి ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఆది, గురు వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. పెట్టుబడుల సామాచారం సేకరిస్తారు. మా జోక్యం అనివార్యం. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం సంతృప్తికరం. రోజువారి ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మంగళ, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. గృహమార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. పరిశ్రమల స్థాపనకు వనరులు సర్దుబాటవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గృహంలో స్తబ్ధత తొలగుతుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కార్యసిద్ధి, పరిస్థితుల అనుకూలతలున్నాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలేర్పడుతాయి. సంప్రదింపులు, వ్యవహారాల్లో మెళకువ వహించండి. గురు, శుక్ర వారాల్లో హామీలివ్వవద్దు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీడియో చూడండి...