Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యోదయం వేళ జపించాల్సిన మంత్రం ఏమిటి?

Written By సిహెచ్
Updated: శనివారం, 2 మే 2026 (14:58 IST)
రవి అంటే సూర్యుడు అని అర్థం. కనుక ఆదివారం నాడు ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. సూర్యుని అనుగ్రహం లేకపోతే కోరిన విద్య లభించదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. జనకమహా రాజు గురువు యాజ్ఞవల్య్కుడు సూర్యుని అశుభ దృష్టి వల్ల వేదవిద్యను అభ్యసించలేకపోయాడు. అందువల్ల తపస్సు చేసి సూర్యుని శుభదృష్టి వల్ల సరస్వతిదేవి అనుగ్రహంతో శాస్త్రజ్ఞానం పొంది, యాజ్ఞవల్య్కస్మృతిని అందించాడు. 
 
అందుకే నవగ్రహాల్లో మొట్టమొదటైన సూర్యుడిని ఆరాధన చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ ఉదయం వేళ... జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని జపిస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది. 
 
సూర్యుని అనుగ్రహం కోసం మాణిక్యాన్ని ధరించాలి. గోధుమలను, ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. పాయసం నివేదించాలి. సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయం పఠించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
About Author
సిహెచ్
Content provider.... Read More

అన్నీ చూడండి

గనుల శాఖ డీడీ ఇంటిపై ఏసీబీ సోదాలు.. రూ.3 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

నేపాల్ వరద విపత్తు - తెలంగాణ వాళ్లు 22 మంది మిస్సింగ్ - 18 మంది ఎన్‌ఆర్‌ఐలు..

లేక్ ఆంటారియో సరస్సు పేరు మార్చిన అమెరికా.. భగ్గుమన్న కెనడా

తిరుమల మెట్లమార్గంలో రోబో డాగ్‌లతో పహారా - ఒక్కో కుక్క ధర ఎంతో తెలుసా?

ప్రియురాలు మోసం చేసిందని పురుగుల మందు తాగిన ప్రియుడు

అన్నీ చూడండి

28-08-2026 రాశి ఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు.. ధనలాభం వుంది..

సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?

రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే

శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం

27-08-2026 రాశి ఫలితాలు, కీలక పత్రాలు అందుకుంటారు

తర్వాతి కథనం
Show comments