ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: బుధవారం, 14 నవంబరు 2018 (12:52 IST)

తెలిసిన అమ్మాయిలతో శృంగారం చేస్తున్నట్లు ఊహలొస్తున్నాయ్... ఇదేమైనా జబ్బా?

మనసులో ఉన్న కోరికను అణుచుకోవాలనే ప్రయత్నంలో ఏర్పడిన గందరగోళమే ఇది. పురుషులకు శృంగారం తాలూకు ఆలోచనలు రావడం సహజమే. పైగా పెళ్లికానివారిలో ఇవీ మరీ ఎక్కువ. పెళ్లికాకుండా శృంగారం చేయడం సాధ్యం కాదు కనుక తనకు తెలిసిన అమ్మాయిలతో ఊహల్లో చేస్తున్నట్లు ఊహించుకుని తృప్తి పొందుతుంటారు. దీనినే ఫాంటసీ అని అంటారు. 
 
ఈ ఊహల్లో సదరు అమ్మాయిలను తన భాగస్వామిగా అనుకుని శృంగారం నడుపుతున్నట్లు కలలు కూడా కనడం జరుగుతుంటుంది. ఐతే అలాంటి ఆలోచనలు దరిచేరకుండా ఉండాలంటే చదువు లేదా చేస్తున్న వృత్తి పట్ల బిజీగా ఉంటే ఆ ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. ఐతే ఇలాంటి ఆలోచనలు రావడమే సహజమే అయినప్పటికీ మితిమీరితే ఇబ్బందులెదుర్కుంటారు.