శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (16:01 IST)

ఆఫీసుకు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే.. ఏమౌతుందో తెలుసా?

ఆఫీసులకు వెళ్తున్న వారికి దుస్తుల ఎంపికలో చాలా అనుమానాలుంటాయి. అలాంటి డౌట్స్ మీలో వుంటే.. ఈ కథనం చదవండి. కార్యాలయాలకు వెళ్లే పురుషులు, మహిళలు మరీ వదులుగా కాకుండా.. మరీ బిగుతుగా వున్నవి ఎంచుకోకూడదు. శర

ఆఫీసులకు వెళ్తున్న వారికి దుస్తుల ఎంపికలో చాలా అనుమానాలుంటాయి. అలాంటి డౌట్స్ మీలో వుంటే.. ఈ కథనం చదవండి. కార్యాలయాలకు వెళ్లే పురుషులు, మహిళలు మరీ వదులుగా కాకుండా.. మరీ బిగుతుగా వున్నవి ఎంచుకోకూడదు. శరీరాకృతికి సరిపోయే దుస్తులను ఎంచుకోవాలి.


ముఖ్యంగా ఆకుపచ్చ రంగు స్నేహభావానికి ప్రతీక అని.. విధులకు వెళ్లేవారు వీలైనంతవరకూ ముదురు రంగులు ముఖ్యంగా నలుపు, నీలం, , గోధుమరంగుల్ని ఎక్కువగా ఎంచుకోవాలి. సంప్రదాయ దుస్తుల్ని ఎంచుకుంటుంటే రంగుల మేళవింపులో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఫ్యాషన్ డిజైనర్లు సలహా ఇస్తున్నారు. చెవులకు పెట్టుకునే దిద్దులు కూడా ఎంత చిన్నగా, సాదాగా ఉంటేనే అంత మంచిది. వీలైనంతవరకూ స్టడ్స్‌ పెట్టుకోవాలి.
 
కెరీర్ పరంగా రాణించాలంటే.. ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా వుండాలంటే.. ఆరోగ్య సమస్యలు లేకుండా ఉత్సాహంగా కార్యాలయంలో కనిపించాలంటే.. దుస్తుల ఎంపిక వాటి రంగులు కూడా ముఖ్యమే అంటున్నారు.. సైకలాజిస్టులు.  
 
ఎలాంటి రంగులు ధరించాలంటే.. 
పచ్చని రంగు దుస్తులు ధరించడం ద్వారా కార్యాలయాల్లో ఉద్యోగం పట్ల అభద్రతా భావం వుండదు. ప్రమోషన్‌లు వుంటాయి. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. స్నేహభావాన్ని పెంపొందింపజేస్తుంది. ఇంకా కంటికి పచ్చ రంగు మేలు చేస్తుంది.

నీలి రంగు దుస్తులు ధరించడం ద్వారా పనిని నిర్ణీత సమయంలో ముగించగలుగుతారు. ఈ రంగు పని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్‌ రంగులో దుస్తులను ధరించడం ద్వారా హోదా పెరుగుతుంది. ఇక నలుపు రంగు, బ్లాక్ సూట్, గ్రీన్, బ్లూ రంగులతో కూడిన సూట్స్ ధరించడం ద్వారా అధికారంలో మార్పులుంటాయి.  
 
ఎలాంటి రంగులు ధరించకూడదంటే..?
కానీ పసుపు రంగు దుస్తులు అస్థిరత్వాన్ని సూచిస్తాయి. పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా చేసే పనుల్లో స్థిరత్వం లోపిస్తుందని.. అలాగే గ్రే రంగులను కూడా నలుపు, నీలపు రంగు కలిసిన విధంగా ధరించడం ద్వారా నెగటివ్ ఫలితాలను తగ్గించుకోవచ్చు. అయితే ఎరుపు రంగు దుస్తులను ఆఫీసుకు ధరించడం కూడదు.

రంగుల్లో ఎరుపు ఉత్తమమైనప్పటికీ.. కార్యాలయాలకు ఈ రంగు దుస్తులను ధరిస్తే.. మెటబాలిజం, రక్తపోటు పెరిగే అవకాశం ఉందని సైకలాజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆరెంజ్, తెలుపు, ఊదా రంగులను కార్యాలయాలకు వెళ్లే వారు ధరిస్తే సానుకూల ఫలితాలుంటాయని వారు సూచిస్తున్నారు.