మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 4 ఆగస్టు 2017 (22:19 IST)

చచ్చేవాడి చెవిలో 'నారాయణ... నారాయణ' అని ఇంకా ఎందుకు?

మనవాళ్లు చాదస్తులు, గుడ్డినమ్మకం కలవారు అనుకున్నంత కాలం వారి అలవాట్లు, ఆచారాలు, వెర్రిగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. ముందే నిర్ణయానికి రాకూడదు. బుద్ధితో ఆలోచన చేయాలి. బాగా బ్రతికినప్పుడు మనస్సులో ఏ భావాలు దృఢమైన సంస్కారాలను కలిగిస్తాయో అవి ఎప్పుడూ జ్ఞాపక

మనవాళ్లు చాదస్తులు, గుడ్డినమ్మకం కలవారు అనుకున్నంత కాలం వారి అలవాట్లు, ఆచారాలు, వెర్రిగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. ముందే నిర్ణయానికి రాకూడదు. బుద్ధితో ఆలోచన చేయాలి. బాగా బ్రతికినప్పుడు మనస్సులో ఏ భావాలు దృఢమైన సంస్కారాలను కలిగిస్తాయో అవి ఎప్పుడూ జ్ఞాపకమొస్తాయి. మరణ కాలంలో జీవుడు దేన్ని స్మరిస్తాడో, దాని అనుబంధం వదలలేక తిరిగి ఆ జన్మను పొందుతాడు. 
 
అందుకనే భగవంతుడిని స్మరిస్తూ కన్నుమూస్తే భగవత్స్వరూపాన్నే పొందుతాడు. అన్ని జ్ఞానాలు వున్నప్పుడే నిరంతరం భగవన్నామస్మరణ చేసుకున్నవాడికి, మరణ సమయంలోనూ దేవుడు జ్ఞాపకం వస్తాడు. అలా చేయని వాడికి దైవ స్మరణ కలిగే అవకాశం లేదు. 
 
కనుక ఇంతకుపూర్వం చేసినవాడికి మరణ బాధలవల్ల ఇంద్రియాలు మనస్సు పనిచేయక దేవుడు స్మరణకు రాడనీ, ఇంతకపూర్వం దైవస్మరణ చేయని వాడికి జ్ఞాపకం వచ్చే అవకాశమే లేదనీ, మనవాళ్లు మరణ సమయంలో చెవిలో నారాయణ... నారాయణ అని వినిపిస్తారు. అప్పుడైనా దైవస్మరణ కలుగుతుందేమోనని చెవి పని చేయక, అది వినబడక పోయినా తులసి తీర్థం నోట్లో వేస్తేనైనా దేవుని స్మరణ కలిగే అవకాశమున్నదని అలా చేస్తారు.