వార్తలను యమలోకాధిపతి యముడు ఎలా సేకరిస్తాడు?
గుడ్లగూబ యముని వార్తాహరుడు. చనిపోయిన మనిషిలోని జీవుడు మరొకచోట మరొక శరీరాన్ని పొందేవరకూ అగ్ని సహాయంతో యమపురికి చేరుతాడు.
అగ్నిలో దగ్ధమైన పితృదేవతలతో కలిసి ఆనందాన్ని పొందుతాడు. అలా అగ్నిలో దగ్ధమైన జీవుణ్ణి పెద్దపెద్దముక్కులతో, నాలుగు కళ్లున్న రెండు కుక్కలు యమలోకానికి చేరుస్తాయట.
మరణించబోయే వ్యక్తులను గాలించి గాలించి వారిని యమపురికి తీసుకుని వెళ్లడమే ఈ కుక్కల పని అని వేదవిజ్ఞానంలో చెప్పబడింది.