మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (16:31 IST)

కర్ణుడు పూర్వజన్మలో రాక్షసుడా?

కర్ణుడు పూర్వజన్మలో సహస్రకవచుడనే రాక్షసుడు. నరనారాయణులు అతనితో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలు సాధిస్తారు. మిగిలిన ఒక్క కవచంతో సహస్రకవచుడు పారిపోయి సూర్యనారాయణుడిలో దాక్కుంటాడు. ఆ తర్వాత నరనారా

కర్ణుడు పూర్వజన్మలో సహస్రకవచుడనే రాక్షసుడు. నరనారాయణులు అతనితో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలు సాధిస్తారు. మిగిలిన ఒక్క కవచంతో సహస్రకవచుడు పారిపోయి సూర్యనారాయణుడిలో దాక్కుంటాడు. ఆ తర్వాత నరనారాయణులే మహాభారతంలో కృష్ణార్జునులుగా జన్మిస్తారు. 
 
మరుజన్మలో కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. జన్మతహః వచ్చిన కవచ కుండలాలను శరీరం నుంచి చీల్చి ఇంద్రుడికి దానం చేస్తాడు. అందువల్లే అతనికి కర్ణుడు అనే పేరు వచ్చింది. నిజానికి మహాభారతంలో దుర్యోధనుని ప్రాపకం పొందేనాటికే అతనికి కవచకుండలాలు లేవు. ఇంద్రుడికి దానమిచ్చేశాడు. 
 
కానీ, సినిమాలు, టీవీ సీరియల్స్‌లలో కర్ణుడిని కవచకుండలాలతో చూపించి మహాభారత యుద్ధ సమయంలో అతను వాటిని ఇంద్రునికి దానం చేసినట్టుగా చూపిస్తారు. అలాగే, కర్ణుడు సైతం ద్రోణాచార్యుని వద్ద కొంతకాలం విద్యను అభ్యసిస్తాడు. కురుపాండవుల అస్త్ర విద్యాప్రదర్శనం కంటే ముందు కర్ణుడెవరో ద్రోణుడికి బాగా తెలుసు.