మహా శివరాత్రి: ఉపవాసం ఉండి, జాగారం చేస్తే..?
మహా శివరాత్రి రోజున ధ్యానం తర్వాత శివాలయానికి వెళ్లాలి. పువ్వులు, బిల్వపత్రం, భస్మం, రుద్రాక్ష, పాలు, పెరుగు, పండు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించి పూజించాలి. శివుని శివరాత్రి రోజున మనసారా పూజిస్తే.. ఉపవాసం తరువాత రాత్రికి ధ్యానంలో వెన్నెముకను సరళ రేఖలో ఉంచడం శక్తిని పెరిగేలా చేస్తుంది. దీనితో శరీరం, మనస్సు శక్తి స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ శక్తి పెరుగుదల శాంతి, మోక్ష జీవితాన్ని పొందవచ్చు.
మహాశివరాత్రి సమయంలో గ్రహాల కూటమి కూడా మారుతుంది. మనం నిటారుగా వెన్నెముకతో కూర్చున్నప్పుడు, గ్రహాల అమరిక కుండలినీ శక్తి వలె మన ప్రాణశక్తిని పెంచుతుంది. యోగులు, మునులు చాలా మంది ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి ముక్తిని పొందారు.
శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పువ్వులు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.