మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (14:33 IST)

శుక్రవారం-శుక్రహోరలో పూజ.. శనివారం మాత్రం ఉప్పు కొంటే?

Lakshmi Devi
శుక్రవారం ఉదయం 6 గంటలకు శుక్ర హోర ప్రారంభమవుతుంది. అలాగే మధ్యాహ్నం ఒక గంట నుంచి 2 గంటల వరకు.. అలాగే రాత్రి 8-9 గంటల వరకు శుక్ర హోరగా భావిస్తారు. ఈ సమయంలో శ్రీలక్ష్మిని పూజించేవారికి సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
ముఖ్యంగా, రుణ సమస్యతో బాధపడేవారు, రుణం ఇవ్వలేక ఇబ్బందులు పడేవారు, రుణం ఇచ్చి తిరిగి పొందలేని వారు.. వృత్తిలో లాభాలు ఆశించే వారు ఈ హోర సమయంలో మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా వ్యాపారవృద్ధిని పొందవచ్చు. 
 
అలాగే ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవచ్చు. శుక్రవారం నాడు, శుక్ర హోరలో పూజలు చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ద్వారా అప్పుల సమస్య తీరుతుంది. ఇచ్చిన అప్పు వసూళ్లు అవుతాయి. 
 
ఈ హోర సమయంలో ఉప్పు కొనుగోలు చేసి పూజ గదిలో ఉంచి పూజ చేసిన తర్వాత ఉప్పు జాడీలో భద్రపరుచుకోవచ్చు. అందులో 5 రూపాయల నాణేన్ని ఉంచవచ్చు. అయితే శనివారం ఉప్పు కొనకూడదు. ఇలా చేస్తే వ్యాపారంలో నష్టం ఏర్పడుతుంది. 
 
శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం పెరుమాళ్ల వారి ఆలయంలో పెరుమాళ్ల వారికి తాయారు అభిషేకానికి పాలు అందజేస్తే ఆదాయం పెరుగుతుంది. ఇంకా పచ్చరంగు మట్టిగాజులను శ్రీలక్ష్మికి ఇవ్వడం ద్వారా ఆర్థిక సమస్యలు వుండవు. ఇలా 24 శుక్రవారాలు శ్రీలక్ష్మి, పెరుమాళ్ల వారికి పాలును అభిషేకానికి అందజేయడం ద్వారా కోటీశ్వరులు అవుతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.