1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (13:15 IST)

అక్షయ తృతీయ రోజున బంగారమే కాదు.. ఉప్పు, పసుపు కూడా..?

Akshaya Tritiya
సాధారణంగా చాలామంది అక్షయ తృతీయ అని చెప్పగానే బంగారం కొనాలని అనుకుంటారు. బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది. గురువు శుక్రులను సూచిస్తుంది. కానీ బంగారంతో పాటు, శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది. 
 
అక్షయ తృతీయ రోజున ఆలయ వస్తువులను వేలంలో కొనుగోలు చేయడం మంచిది. చిన్న విషయమే అయినా ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా కొత్త ధాన్యాలు, ఉప్పు, పసుపు మొదలైనవి ఆహార పదార్ధాలు అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. 
 
అక్షయ తృతీయ నాడు ఇంట్లో కొత్త దేవుని చిత్రపటం, కంచు గంట, కుంకుమ, కామాక్షి దీపం, చందనం, ఇతర దివ్య వస్తువులు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది.