శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (21:51 IST)

కపిల తీర్థంలో పుణ్య స్నానం చేస్తే ప్రపంచంలోని తీర్థాలన్నిటిలోనూ... (Video)

పూర్వం ఒకప్పుడు ఓ బ్రాహ్మణుడు క్షేత్రాలను దర్శిస్తూ, తీర్థాల్లో మునకలిడుతూ దేశ సంచారం చేస్తుండేవాడు. అసలు ప్రపంచంలో ఎన్ని తీర్థాలు వున్నాయో వాటి అన్నింట్లోనూ స్నానం చేసి తరలించాలని భావించి తిరుగుతుండేవాడు. అలా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నందువల్ల చాలా బలహీనుడై శుష్కించిన శరీరంతో, నీరసించి, శోషించి, మగతనిద్రకు లోనయ్యాడు.
 
ఆ నిద్రలో వేంకటేశ్వర స్వామి కనిపించి... ఓ బ్రాహ్మణోత్తమా... నీ ప్రయత్నం అసాధ్యమైంది. నీకే కాదు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఎప్పటికీ నెరవేరదు కూడా. కానీ వేంకటాచల క్షేత్రంలో కపిలతీర్థం మొదలుగా అత్యంత ప్రధానమైన హదిహేడు పుణ్యతీర్థాలున్నాయి. వాటిల్లో శాస్త్రోక్తంగా నియమంగా స్నానం చేస్తే చాలు, ప్రపంచంలోని తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది.
 
అందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల నీవు ఆ పదిహేడు తీర్థాల్లో స్నానం చెయ్యి. నీ కోరిక నెరవేరినట్లవుతుంది అన్నాడు. ఆ స్వప్నం మేరకు బ్రాహ్మణుడు మేల్కొని తన తీర్థాటనను విరమించుకుని వేంకటాచల క్షేత్రానికి వెళ్లి అక్కడ వున్న పదిహేడు తీర్థాలను సేవించి ముక్తి పొందాడు.