శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 జులై 2019 (22:39 IST)

మణిద్వీప వర్ణనను పదేపదే పఠిస్తే దరిద్రం పరార్...

మణిద్వీప వర్ణనను పదేపదే పఠిస్తే చాలు... దరిద్రము దరిదాపునకు రాదని శాస్త్రప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్పలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందేగానీ, దానిని వర్ణించుటకు వేయి పడగలు గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. 
 
లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన ముప్పది రెండు రకాల పూలతో మణిద్వీప వాసినికి అర్చన చేసి పసుపు, కుంకుమ, గంధాక్షితలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు.
 
అంతేగాక కుటుంబ సభ్యులంతా తరతరాల వరకూ అష్టసంపదలతో, భక్తి జ్ఞాన, వైరాగ్య, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు, సిధ్దులు, జ్ఞానులు, మహా భక్తుల ఇంట జన్మలు ధరించి అంత్య కాలమున మణిద్వీప నివాసులై మోక్షధామము చేరుకుంటారు.