గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 19 జులై 2021 (20:04 IST)

కన్నులపండువగా పుష్పయాగం, జపతర్పణ హోమాలు

కలియుగ వేంకటేశ్వరస్వామి పట్టపురాణి పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా శాస్త్రోక్తంగా పుష్పయాగం, జపతర్పణ హోమాలు జరిగాయి. ఏకాంతంగానే ఈ కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తోంది.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు.  ఉదయాన్నే ఆలయంలోని శ్రీక్రిష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు. టిటిడి పాంచరాత్ర ఆగమ పండితుల పర్యవేక్షణలో బుత్వికులు చతుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవర్తి, హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు.
 
ఇందులో భాగంగా 120మంది కోటి అర్చన, 36మంది హోమం, 12మంది భాష్యం, రామాయణం, భాగవతం, మహాభారతం పారాయణం, 12మంది జపం, 12మంది ఆవుపాలతో తర్పణం నిర్వహిస్తున్నారు.
 
వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించారు. కోవిడ్ కారణంగా ఏకాంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా భక్తుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం గత యేడాది నుంచి కోవిడ్ కారణంగా ఏకాంతంగానే టిటిడి నిర్వహిస్తోంది.