బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (11:33 IST)

వెంకన్నకు రూ. 1,11,11,111 విరాళం.. ఇచ్చిందెవరో తెలుసా?

జియోతో టెలికాం రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాత జియోఫోన్ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను కూడా విడుదల చేసింది. దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి

జియోతో టెలికాం రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాత జియోఫోన్ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను కూడా విడుదల చేసింది. దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రిలయన్స్ జియో.. కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ శ్రీవారికి భారీ కానుకలిచ్చుకున్నారు. 
 
మరోసారి తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని వెంకన్నకు విరాళంగా ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ఈ విరాళాన్ని అందించి, ప్రాణాపాయంలో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడాలని ముఖేష్ అంబానీ కోరారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధి ఒకరిని తిరుమలకు పంపించి, విరాళాన్ని అందించారు. 
 
తిరుమలలోని దాతల విభాగంలో ఈ విరాళం చెక్కును అధికారులు స్వీకరించారు. గతంలోనూ ముఖేష్ అంబానీ పలుమార్లు వెంకటేశ్వరునికి కోట్లాది రూపాయలను విరాళంగా సమర్పించిన సంగతి తెలిసిందే.