గురువారం, 7 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (18:39 IST)

ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇస్తాం.. టీటీడీ ప్రకటనపై భక్తుల ఫైర్

laddu
ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇస్తామని టీటీడీ తెలిపింది. దర్శన టోకెన్‌కు ఒక లడ్డూ, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డూ ఇస్తామనే కొత్త నిబంధనను గురువారం నుంచి టీటీడీ అమలు చేసింది.  దీంతో టీటీడీ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. 
 
స్వామి వారి ప్రసాదం అందరికీ అందేలా చూడాలి కానీ.. ఇలా ఆంక్షలు విధించడం సరికాదంటున్నారు. వెంటనే టీటీడీ రూల్స్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
అయితే బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డూల నిల్వ కోసమే నిబంధనలు మార్చాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. లడ్డూ విధానంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు. 
లడ్డూ పాలసీలో ఎలాంటి మార్పు లేదన్నారు. 
 
స్వామి వారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక్క లడ్డు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. భక్తుల అవసరానికి అనుగుణంగా లడ్డూలు వితరణ చేస్తున్నామన్నారు.