గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (13:31 IST)

ఈ నెల 24న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

ttdtemple
ఈ నెల 24వ తేదీన శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేయనుంది. ఇది మే నెల కోటాకు సంబంధించిన టిక్కెట్లు. తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించిన కోటా టిక్కెట్లను రిలీజ్ చేయనుంది. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.
మే నెల కోటా టికెట్ల విడుదల ముఖ్యమైన తేదీలు ఇవే...
 
ఫిబ్రవరి 19- ఉదయం 10 గంటలకు... శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు విడుదల
ఫిబ్రవరి 21- ఉదయం 10 గంటల వరకు... ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకునే అవకాశం
ఫిబ్రవరి 21- మధ్యాహ్నం 12 గంటలకు... లక్కీ డిప్‌లో టికెట్ల మంజూరు. టికెట్లు లభించిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలన్న టీటీడీ
ఫిబ్రవరి 22- ఉదయం 10 గంటలకు... ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవ వర్చువల్ సేవా టికెట్ల కోటా విడుదల
ఫిబ్రవరి 22- మధ్యాహ్నం 3 గంటలకు... వర్చువల్ సేవలు, వాటి స్లాట్లకు సంబంధించిన కోటా విడుదల
ఫిబ్రవరి 23- ఉదయం 11 గంటలకు... శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటా విడుదల
ఫిబ్రవరి 23- ఉదయం 10 గంటలకు... అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల
ఫిబ్రవరి 23- మధ్యాహ్నం 3 గంటలకు... వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘరోగ పీడితులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ఫిబ్రవరి 24 - ఉదయం 10 గంటలకు... రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల ఫిబ్రవరి 24- మధ్యాహ్నం 3 గంటలకు... తిరుపతి, తిరుమలలో వసతి గదుల కోటా టికెట్ల విడుదల
ఫిబ్రవరి 27- ఉదయం 11 గంటలకు... శ్రీవారి సేవా టికెట్ల విడుదల ఫిబ్రవరి 27- మధ్యాహ్నం 11 గంటలకు... నవనీత సేవా టికెట్ల విడుదల ఫిబ్రవరి 27- మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవా టికెట్ల విడుదల