శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (14:09 IST)

శ్రీకాళహస్తిలో అనూహ్య రద్దీ, రాహుకేతు పూజకు డిమాండ్

కరోనావైరస్ సమయంలో ఆలయాల్లో భక్తుల రద్దీ బాగా తగ్గుతోంది. ముఖ్యంగా ప్రధాన ఆలయాల్లో సైతం దర్సనానికి భక్తులు రావడం లేదు. అయితే గత రెండురోజుల నుంచి భక్తుల రద్దీ శ్రీకాళహస్తిలో విపరీతంగా పెరిగింది. దర్సనంతో పాటు రాహుకేతు పూజలను చేయించుకుంటున్నారు భక్తులు.
 
వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చాలా ఫేమస్. ప్రపంచ నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు శ్రీకాళహస్తికి చేరుకుని రాహు,కేతు పూజలను చేయించుకుంటూ ఉంటారు. ఇదంతా సరిగ్గా కరోనాకు ముందు మాట. 
 
కానీ కరోనా పుణ్యమా అని రాహు, కేతు పూజలకు వచ్చే భక్తులు సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆలయాన్ని తెరిచినా కూడా భక్తుల రద్దీ మాత్రం అంతంతమాత్రంగా తయారైంది. దర్సనం చేసుకున్న భక్తుల్లో రాహు, కేతు పూజలు చేయించుకున్న వారైతే చాలా తక్కువ.
 
అయితే వారం రోజుల క్రితం 100 రాహు, కేతు పూజలకు పెరిగితే రెండురోజుల నుంచి పూజల సంఖ్య 300 దాటింది. భార్యాభర్తలు కలిసి చేయించుకునే ఈ రాహు, కేతు పూజల్లో రద్దీ ఎక్కువగా ఉండడం ఆలయ అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్రీకాళహస్తికి వచ్చే భక్తుల్లో ఎక్కువగా తమిళనాడు వాసులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రస్తుతం తమిళనాడు వాసులు ఎక్కువగా శ్రీకాళహస్తికి వస్తున్నట్లు దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.