గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 19 ఆగస్టు 2021 (23:54 IST)

భక్తులు త్వరపడండి, పద్మావతి అమ్మవారి వరలక్ష్మివ్రతంలో మీరూ పాల్గొనవచ్చు, ఎలా?

సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 20వ తేదీన వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా నిర్వహిందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఈ కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించనున్నారు.
 
ఆగష్టు 20వ తేదీన ఉదయం అమ్మవారి మూలవర్లకు, ఉత్సవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీక్రిష్ణస్వామి ముఖ మండపంలో వరలక్ష్మివ్రతం నిర్వహించనున్నారు. కేవలం టిటిడికి సంబంధించిన భక్తి ఛానల్‌లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
 
వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలు కల్పించింది టిటిడి. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లను కూడా విక్రయిస్తోంది. ఈ సేవలో పాల్గొనాలంటే టిటిడి వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. టిక్కెట్లు పొందిన వారికి ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా గృహస్తుల చిరునామాకే టిటిడి పంపించనుంది.