శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. 2017 రౌండప్
Written By TJ
Last Modified: మంగళవారం, 26 డిశెంబరు 2017 (15:26 IST)

2017 చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిదంటున్న అల్లరి నరేష్‌... ఎందుకు..?

గత కొన్నినెలలుగా హిట్ సినిమాలు లేక ఇబ్బందిపడిపోతున్నాడు హీరో అల్లరి నరేష్. తను నటించే సినిమాల్లో కొత్తదనం ఉన్నా వాటిని ప్రేక్షకులు ఆదరించకపోవడంతో డీలా పడిపోయారు. 2017 సంవత్సరం తనకు కలిసిరాలేదని స్నేహితులతో చెబుతున్నాడు నరేష్. అయితే 2018 సంవత్సరం మాత్

గత కొన్నినెలలుగా హిట్ సినిమాలు లేక ఇబ్బందిపడిపోతున్నాడు హీరో అల్లరి నరేష్. తను నటించే సినిమాల్లో కొత్తదనం ఉన్నా వాటిని ప్రేక్షకులు ఆదరించకపోవడంతో డీలా పడిపోయారు. 2017 సంవత్సరం తనకు కలిసిరాలేదని స్నేహితులతో చెబుతున్నాడు నరేష్. అయితే 2018 సంవత్సరం మాత్రం ఖచ్చితంగా కలిసి రావాలని, అది కూడా మొదటి సినిమాతోనే తానేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే సక్సెస్ డైరెక్టర్ల వెంట పడ్డాడు అల్లరి నరేష్‌. 
 
వైవిధ్య కథాంశాలతో చిత్రాన్ని తీయగల దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. ఆయన్ను గట్టిగా పట్టుకున్నాడు నరేష్‌. తనతో సినిమా చేయండంటూ వెనకాల పడటంతో భీమినేని, నరేష్‌ను తీసివేయలేక ఒక కథను సిద్ధం చేశాడు. ఆ కథ అల్లరి నరేష్‌‌కు బాగా నచ్చేసిందట. దీంతో నరేష్‌ ఎప్పుడు సినిమా మొదలు పెడదామా అంటూ మళ్ళీ డైరెక్టర్‌ను కోరడం ప్రారంభించారట. జనవరి మొదటివారంలో సినిమాను మొదలుపెడదామని డైరెక్టర్ చెప్పడంతో అల్లరి నరేష్‌ సంతోషంగా ఉన్నాడట.