శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By chj
Last Modified: బుధవారం, 11 జనవరి 2017 (15:47 IST)

సంక్రాంతి పర్వదినాన పితృ దేవతారాధన ఎందుకు చేస్తారంటే....

భోగి మరుసటిరోజు సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగకు మకర సంక్రాంతి అని కూడా పేరు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. కుటుంబంలోని వారు

భోగి మరుసటిరోజు సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగకు మకర సంక్రాంతి అని కూడా పేరు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. కుటుంబంలోని వారు వారి పితృదేవతలను తలచుకొని పూజించడం, వారికి వస్త్రాలు పెట్టడం, పొంగలి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ పండుగ ప్రత్యేకత పిండివంటలు. బెల్లం, నువ్వులు వంటి పదార్ధాలను వినియోగించి చేసిన అరిసెలు, బూరెలు, చక్కిలాలు, లడ్డూలు, మురుకులు వంటి పిండివంటలు తినడం చలివాతావరణానికి రక్షణకారి కూడా.
 
సూర్యుడు మకర రాశి లో ప్రవేశించే పుణ్య ఘడియల్లో ఉత్తరాయణ పుణ్య కాలం ఆరంభం. దేవమార్గం ప్రారంభమయ్యే రోజు. ఈ రోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు, వ్రతాలు విశేష ఫలితాలనిస్తాయి. సంక్రాంతి రోజు గుమ్మడి, వస్త్రములు దానం చేయడం ఆచారం. విష్ణు సహస్రనామ పఠనమ్ ఈ రోజున మిక్కిలి శుభఫలాలనిస్తుంది. దేవ పితృ దేవతలనుద్దేసించి  చేసే తర్పణాలు, దానాలు పుణ్యప్రదం. పౌష్య లక్ష్మిగా అమ్మవారి ని ఆరాధించే సమయం. సంక్రాంతి రోజు స్నానం చేయని వారికి రోగాదులు వస్తాయని ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. సంక్రాంతి రోజు దేవతలకు, పితృదేవతలకు, పాత్రులకు ఏయే దానాలు చేస్తామో అవి జన్మజన్మలకి అత్యధికంగా లభిస్తాయని ప్రతీతి. 
 
ఈ పుణ్య కాలంలో తిలలు, బియ్యం కలిపి శివారాధన చేయడం,ఆవు నేతితో అభిషేకం చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేష్ఠమైనది. నల్ల నువ్వులతో పితృతర్పణాలు ముఖ్యం గా ఆచరించవలసిన విధి. సంక్రమణం’ నాడు ఒంటి పూజ భోజనం చేయాలి. దేవతలకు పితృదేవతల పూజలకు పుణ్యకాలం. మంత్ర జపాదులకు, ధ్యానం పారాయయణ శ్రేష్ఠఫలాలని శీఘ్రంగా ప్రసాదించే కాల మహిమ సంక్రమణానికి ఉంది. బెల్లం, గుమ్మడి కాయలు దానమిస్తారు. పితృదేవతలకు "తర్పణాలు" వదులుతారు. ఈ రోజున కూడ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "రథం" ముగ్గు వేయటం సాంప్రదాయం. ఈరోజు కూడా "గొబ్బెమ్మలు" పెడతారు. బొమ్మల కొలువు, పేరంటం చేస్తారు.